ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. అది ముసలిది అవడంతో వేటాడలేకపోయేది. ఊహ లోనే ఉండి, అటు దగ్గరగా వచ్చిన జంతువులను చంపి తన ఆకలిని తీర్చుకునేది. ఒక్కసారిగా ముసలి సింహానికి లేడి మాంసం తినాలనిపించింది. ఆ ఆశ ఎలా తీరుతుందా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఆ సమయంలో గుహ ముందు నుంచి వెళ్తున్న నక్క సింహాన్ని చూసి పలకరించింది. "ముసలిదాన్ని అయిపోయాను, లేడీ మాంసం తిని చాలా కాలం అయ్యింది ఎలా?"అంది సింహం. నక్కకి కూడా లేడీ మెదడు తినాలన్న కోరిక ఉంది. లేడీ తో సమానంగా తను పరిగెత్తలేదు కనుక తన కోరిక తీరలేదు. ఇప్పుడు సింహం లేడి గురించి చెప్పగానే మంచి పథకం ఒకటి ఆలోచించింది." లేడికి మాయమాటలు చెప్పి తీసుకు వస్తాను. మీరు మాత్రం తొందరపడవద్దు."అంది నక్క..ఆ అడవిలో చాలా దూరం తిరిగింది. దానికి చివరకి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న లేడీ కనిపించింది.

"అబ్బా ఇక్కడ ఉన్నావా? నీ గురించే వెతుక్కుంటూ వచ్చాను"అంది నక్క

"నా కోసమా? ఎందుకు? అనుమానంగా అడిగింది లేడీ.
మన మహారాజు ముసలివాడై పోయాడు కదా! ఆయన నిన్ను అడవికి రాజు ని చేస్తాడట పిలుచుకు రమ్మన్నాడు. పద వెళ్దాం "అంది నక్క

"నీ మాటలు నేను విశ్వసించను .నేను రాను "అంది లేడి
నా మాట వాస్తవమో కాదో గుహకు వస్తే తెలుస్తుంది. మహారాజు కబురు పంపినప్పుడు వెళ్ళటం కనీస ధర్మం కదా!"అంది నక్కరెండూ కలిసి సింహం గుహ కి వెళ్ళాయి. సింహం లేడి ని చూస్తూనే మీదకు దూకబోయింది. లేడీ తప్పించుకుని పారి పోయింది.

"ఏమిటి రాజా అలా చేశారు. మీరు తొందరపడకుండా ఉండాల్సింది. సరే! నేనే ఎలాగో బతిమాలి మళ్లీ దాన్ని తీసుకు వస్తాను"అంటూ నక్క వెళ్ళిపోయింది.


నక్క తిన్నగా లేడి దగ్గరకు వెళ్ళింది. "నువ్వు భయపడి పారిపోయి ఎందుకు వచ్చావు? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటుందో చూద్దామని చిన్న పరీక్ష పెట్టాడు మహారాజు, నువ్వేమో పారిపోయావు. నేనే ఏదో సర్ది చెప్పాను, రా! ఈసారి ఆయన అలా చెయ్యరులే"అంది నక్క..నక్క చెప్పిన మాటలు నమ్మి దానితోపాటు మళ్లీ గుహకు వెళ్ళింది లేడీ. సింహం ఏమాత్రం తొందరపడకుండా, లేడి బాగా దగ్గరగా వచ్చాక బలంగా పంజా విసిరింది. ఆ పంజా దెబ్బకు లేడి మరణించింది.

"మహారాజా! మీరు తినడానికి తొందరపడవద్దు. చక్కగా స్నానం చేసి రండి. అప్పటి దాకా నేను ఇక్కడే ఉంటాను"అంది నక్క.. ఇక నక్క వల్లే కదా నాకి లేడీ దొరికింది. అది నన్ను మోసం చేయదు అనుకుంటూ సింహం స్నానానికి వెళ్ళింది. సింహం వచ్చేలోగా నక్క లేడి మెదడు ఆరగించింది. ఏమీ ఎరగనట్టు కూర్చుంది. సింహం తిరిగి వచ్చి లేడిని తినబోతూ దానికి మెదడు లేకపోవడం గమనించి నక్కను అడిగింది.

నక్క అతివినయం ప్రదర్శిస్తూ" దానికి మెదడు ఎక్కడిది ప్రభువు! ఒక్కసారి మీ నుండి తప్పించుకుంది. పదవి మీద ఆశతో రెండోసారి కూడా వచ్చింది. నిజంగా దానికి మెదడు ఉంటే రెండో సారి కూడా మోస పోతుందా చెప్పండి"అంది నక్క

అవును నక్క చెప్పింది నిజమే అనుకుంది మెదడు లేని సిం

మరింత సమాచారం తెలుసుకోండి: