
అప్పట్లో తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె1960 డిసెంబర్ 2న పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది.ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగవ తరగతి వరకూ చదువుకొని తరువాత చదువుకు స్వస్తి చెప్పింది. అయితే ఈమెకు పేదరికం కారణంగా చిన్నతనంలోనే వివాహం చేశారు. కానీ భర్త, అత్తగారు పెట్టే బాధలు తట్టుకోలేక ఇంటి నుంచి వచ్చేసిన సిల్క్ స్మిత, సినీ నటి కావాలనే ఆకాంక్షతోనే మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. ఇక తన పేరును కూడా స్మిత గా మార్చుకొని, అలా తెలిసిన వారి దగ్గర నటనలో నైపుణ్యం సంపాదించింది.


ఒకరోజు షూటింగ్ సందర్భంగా సిల్క్ స్మిత చేతి నుండి జారిన ఆపిల్ కోసం అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆపిల్ ను వేలం వేయగా, అప్పట్లోనే 120 రూపాయలుకు కొన్నాడు ఒక అభిమాని. అంతలా ఆమె అభిమానులలో క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే సిల్క్ స్మిత ఎప్పుడూ కూడా గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని అనుకోలేదు. సావిత్రి, సరిత,సుజాత మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది తనకు అలాంటి పాత్రలు ఇవ్వాలని దర్శకులను కోరింది.


