ఐపీఎల్-11 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అందరూ ఊహించినట్లుగా ఎలాంటి ఉత్కంఠకు అవకాశం లేకుండా పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. టైటిల్ మ్యాచ్ లో వాట్సన్ సెంచరీతో చెలరేగటంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది..

Image result for ipl final 2018

నెలన్నర పాటు క్రికెట్ ప్రేమికులను అలరించిన ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో 8 వికెట్ల తేడాతో ధోనీ టీమ్ భారీ విజయం నమోదు చేసింది. షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే చెన్నై జట్టు టైటిల్ ను సొంతం చేసుకుంది..

Image result for ipl final 2018

ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. టోర్నీలో 1, 2 స్థానాల్లో నిలిచిన జట్లే టైటిల్ పోరులో తలపడుతుండటం కూడా ఈ మ్యాచ్ పై భారీ అంచనాలను రేపింది. మరోవైపు పటిష్టమైన బౌలర్లతో బలంగా ఉన్న సన్ రైజర్స్ తో శతృ దుర్భేధ్యమైన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్... ఇవన్ని కలిపి ఫైనల్ మ్యాచ్ పై భారీ అంచనాలను నిలిపాయి. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ... పూర్తి ఏకపక్షంగా మ్యాట్ సాగింది..

Image result for ipl final 2018

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... చక్కటి లైన్ అండ్ లెగ్త్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే గోస్వామి వికెట్ ను సన్ రైజర్స్ కోల్పోయింది. భారీ ఇన్నింగ్స్ కు పునాది పడుతున్న సమయంలో ధావన్ పెవిలియన్ చేరడంతో రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. కెప్టెన్ విలియమ్ సన్  అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. 47 రన్స్ చేసిన విలియమ్ సన్... శర్మ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. చివర్లో యూసుఫ్ పఠాన్ మెరుపులతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది..

Image result for ipl final 2018

179 రన్స్ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ను మేడిన్ గా ఇచ్చిన వాట్సన్.... తర్వాత కూడా ఆచితూచి ఆడాడు. పవర్ ప్లేలో కేవలం 35 రన్స్ మాత్రమే చేసిన చెన్నై... ఏడో ఓవర్ నుంచి చెలరేగింది. ఆకాశమే హద్దుగా వాట్సన్ చెలరేగడంతో సన్ రైజర్స్ బౌలర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 33 బంతుల్లో 50 రన్స్ చేసిన వాట్సన్... సెంచరీ పూర్తి చేసేందుకు మాత్రం మరో 18 బంతులు మాత్రమే తీసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 13వ  ఓవర్ లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో సహా మొత్తం 27 పరుగులు రాబట్టిన వాట్సన్ కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సిరీస్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన రైజర్స్ బౌలర్లకు వాట్సన్ చుక్కలు చూపించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టైటిల్ ను సొంతం చేసుకుంది..

Image result for ipl final 2018

ఐపీఎల్-11 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 20 కోట్ల రూపాయలను ప్రైజ్ మనీగా అందుకోగా.... రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ 12.5 కోట్ల రూపాయలు అందుకుంది. సెంచరీతో చెలరేగిన వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ మూడో సారి టైటిల్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: