ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగిన సంగతి విదితమే. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ రుతు రాజు బ్యాటింగ్ లో దుమ్ము దులిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన గైక్వాడ్... ఐపీఎల్ చరిత్రలో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి సిక్సర్ బాది సెంచరీ నమోదు చేసుకున్నాడు గైక్వాడ్. కేవలం 60 బంతుల్లోనే 101 పరుగులు చేసి  రికార్డుల్లోకి గైక్వాడ్. ఈ సెంచరీలో ఏకంగా 9 ఫోర్లు మరియు ఐదు భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇక సెంచరీతో పలు రికార్డులను బ్రేక్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గైక్వాడ్. ఏంటో ఇప్పుడు చూద్దాం.
 
1. రుతు రాజ్ గైక్వాడ్...  ఐపీఎల్ చరిత్రలోనే.. తన కెరీర్ లో మొదటి సెంచరీని సాధించాడు.
2. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్ టోర్నీలో 9 వ సెంచరీ చేసిన ఆటగాడి గా గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు.
3. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ కొట్టిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు గైక్వాడ్. గైక్వాడ్ ప్రస్తుత వయసు 24 సంవత్సరాల 244 రోజులు.
4. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇదే ఏడవ సారి కావడం విశేషం.
5. ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సెంచరీ కొట్టిన మూడవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక అంతకుముందు 2010 సంవత్సరంలో మురళీ విజయ్ అలాగే 2018 సంవత్సరంలో షేన్ వాట్సన్ లు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సెంచరీలు నమోదు చేశారు. వీరిద్దరి తర్వాత వరుసలో నిలిచాడు గైక్వాడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: