ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడు బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరగా శ్రేయస్ అయ్యర్ 8 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 10 పరుగులు చేయగా ఓపెనర్ పృథ్వీ షా 60 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత షిమ్రాన్ హెట్మీర్ తో రిషబ్ పంత్ కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 24 బంతుల్లో 37 పరుగులు చేసి చివర్లో షిమ్రాన్ హెట్మీర్ అవుట్ కాగా పంత్ మాత్రం 35 బంతుల్లో 51 పరుగులు చేసి మరో అర్థశతకం తన ఖాతాలో వేసుకుని చివరి వరకు నాటౌట్గా నిలిచాడు .దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే చెన్నై సూపర్ కింగ్స్ 173 పరుగులు చేయాల్సిందే. కానీ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అని చెప్పాలి. అయితే ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గనక విజయం సాధిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఫైనల్స్ కి వెళ్ళిన మొదటి జట్టుగా నిలుస్తుంది. లేదంటే క్వాలిఫైయర్ 2 కి వస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: