క్రికెట్ అనే ఒక ఆటలో మంచి నేషనల్ ప్లేయర్ కావడమంటే మాములు విషయం కాదు. మీలో ఎంత ప్రతిభ ఉన్నా సరే ఆ ప్రతిభను ఎక్కడ ఎలా వాడాలో చెప్పడానికి మీలో దాగి ఉన్న ఎన్నో అపారమయిన సామర్ధ్యాలను వెలికి తీయడానికి ఒక గురువు చాలా అవసరం. ఈ ప్రపంచం లో కోచ్ లేకుండా ఏ ఆటగాడు మంచి స్థాయికి చేరుకోగలడన్న దానికి రుజువు లేదు. ప్రతి ఒక్కరికీ కోచ్ పాత్ర చాలా ముఖ్యమైనది. అదే విధముగా ఇప్పుడు మన ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్స్ కు ఎంతోమంది మంచి మంచి కోచ్ లు ఉన్నారు. అలాగే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ అయిన రిషబ్ పంత్ కు కూడా ఒక కోచ్ ఉన్నారు.

చిన్న తనం నుండి తనలో తనకే తెలియని టాలెంట్ ను నమ్మి ఎంతో విశ్వాసంగా తనను ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆడే లాగా కోచింగ్ ఇచ్చారు తారక్ సిన్హా. అయితే దురదృష్టవశాత్తూ ఆయన ఈ రోజు ఢిల్లీ లో కాన్సర్ తో బాధపడుతూ మరణించారు. ప్రస్తుతం ఈయనకు 71 సంవత్సరాలు. ఇండియా కోచ్ లకు ఇచ్చే అత్యంత గౌరవమైన పురస్కారమయిన ద్రోణాచార్య అవార్డును అందుకున్న అయిదు మందిలో సిన్హా ఒకరు కావడం విశేషం. తారక్ సిన్హాకు 2018 లో తన కోచింగ్ ప్రతిభకు గాను ద్రోణాచార్య అవార్డును అందుకున్నాడు. సిన్హా కన్నా ముందు దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్, సునీత శర్మ లు ఉన్నారు.

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న చాలా మందికి సిన్హా శిక్షణ ఇచ్చారు. అందులో మనోజ్ ప్రభాకర్, అంజుమ్ చోప్రా, ఆశిష్ నెహ్రా, శిఖర్ ధావన్ లాంటి మేటి ఆటగాళ్లున్నారు. వీరంతా కూడా తమ క్రికెట్ కెరీర్ లో ఎన్నో శిఖరాలను అందుకున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: