ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్లో భాగంగా నిరాశపర్చిన టీమిండియా మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్తో జరగబోయే వరుస సిరీస్లలో సత్తా చాటేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా టీమిండియా వెస్టిండీస్ తో మూడు వన్డేలు  మూడు 20 లో సిరీస్ కోసం సిద్ధమైంది. ఇకపోతే ఇటీవల బిసిసిఐ ఇక వన్డే టి20 ఆడబోయే జట్టు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బిసిసిఐ ప్రకటించిన వన్డే టి20 జట్టు చూసి కొంతమంది అభిమానులు పర్ఫెక్ట్గా జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కొంత మంది  మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే  రిషి ధావన్ పేరు లేకపోవడం ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి.


 ప్రస్తుతం భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ల కొరత ఉంది అంటూ గత కొన్ని రోజుల నుంచి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. సెలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల దేశవాళీ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు రిషి ధావన్. అయితే అతను ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాలో  చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే  ఎంతోమంది బీసీసీఐ సెలెక్టర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ లో బాగా రాణించిన  ఆటగాళ్లను భారత జట్టు ఎంపిక చేసిన సెలెక్టర్లు అటు దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లను మాత్రం ఎందుకు సెలక్ట్ చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.


 ఐపీఎల్లో ఆడకపోవడం రిషి ధావన్ చేసిన నేరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇకప్పుడు దేశావాలి టోర్నీలో రాణించిన ఆటగాళ్ళ కే అటు అంతర్జాతీయ క్రికెట్ జట్టులో అవకాశం కల్పించారు.. కేవలం  ఆటగాళ్ల పర్ఫామెన్స్ ఆధారంగానే  టీమ్ ఇండియాలో సెలెక్ట్ చేసేవారు. కానీ గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు మాత్రమే టీమిండియాలో చోటు దక్కుతూ ఉండటం గమనార్హం. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్లో రాణించిన ఎంతో మంది ఆటగాళ్ళు టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో రాణించడం లాంటివి కూడా చేశారూ. అయితే ఇప్పటివరకూ ఐపీఎల్ ఆడని రిషీ ధావన్ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా అద్భుతంగా రాణించిన రిషి ధావన్ బ్యాటింగ్ లో 69.3 సగటుతో ఉండగా ఇక బౌలింగ్ లో 5.95 ఎకనామిక్ తో కొనసాగుతున్నాడు.  ఇలాంటి ఆటగాడికి టీమిండియాలో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl