భారత క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. తన అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకవైపు బౌలింగ్ లో కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు.. మరోవైపు బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు అవసరమైనప్పుడల్లా భారీ స్కోర్ చేసేవాడు హార్దిక్ పాండ్యా. ఒక రంగా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇలా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా  గత కొంత కాలం నుంచి భారత జట్టుకు దూరం అయిపోయాడు.


 ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఇక సరైన ప్రదర్శన చేయలేకపోతున్న హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత బిసీసీఐ అతని పక్కన పెట్టేసింది. టి20 వరల్డ్ కప్ లో సెలెక్టర్లు అతని జట్టులోకి తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బౌలింగ్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటింగ్ లో అయినా రాణిస్తాడా అనుకుంటే మళ్లీ నిరాశపరిచాడు హార్దిక్ పాండ్యా.  దీంతో గత ఏడాది టి20 వరల్డ్ కప్ నుంచి జట్టుకు పూర్తి గా దూరం అయిపోయాడు.


 ఇకపోతే ఇటీవలే రంజీ ట్రోఫీ లో కూడా అతను ఆడటం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే రంజీల్లో హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడటం లేదు అన్న ప్రశ్నకు ఇటీవల భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఘాటుగానే స్పందించారు. అతను ఎందుకు ఆడటం లేదు మాకు తెలియదు.. మీరు ఏమైనా అడగొచ్చు కదా.. అతడు 100% ఫిట్నెస్ సాధిస్తే అతని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అతడిని సెలెక్ట్ చేయాలో వద్దో మాకు తెలుసు క్లారిటీ ఉంది అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు  సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: