
ఏకంగా చేతిలో ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇది కాస్త ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రీలంకలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీలంక జట్టుతో టీమిండియా పర్యటనకు వచ్చింది. ఇక్కడ మొదటి టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత టెస్టు సిరీస్లో టీమిండియాతో తలపడబోతుంది. అయితే ఇటీవలే ఇండియా పర్యటన కోసం శ్రీలంక జట్టు ఎంపిక చేయగా ఇందులో స్టార్ క్రికెటర్ గా ఉన్న భానుకా రాజకప్పకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ విషయంపై అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో శ్రీలంక లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లంక జట్టు లో భానుక రాజకప్ప కు చోటు దక్కకపోవడం తో ఇక అభిమానులందరూ రోడ్డెక్కి ప్లకార్డులు పట్టుకుని శ్రీలంక క్రికెట్ బోర్డు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమ అభిమాన క్రికెటర్ భానుక రాజాకప్పను జుట్టు లో చోటు కల్పించాలని లేదంటే నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని అభిమానులు హెచ్చరించారు. ఇది కాస్తా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయంటూ భాను క రాజకప్పను శ్రీలంక క్రికెట్ బోర్డు పక్కన పెట్టింది.