ఐపీఎల్ ప్రారంభానికి ఎన్నో రోజులు లేదు. బీసీసీఐ ముందుగా అనుకున్న ప్రకారమే సరైన సమయానికి ఐపీఎల్ ప్రారంభిస్తోంది. ఇక ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది.  ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది రన్నరప్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రారంభ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు కొన్ని జట్లకు మాత్రం ఊహించని షాక్ లు తగులుతున్నాయ్ అని చెప్పాలి.


 జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా గాయాల కారణంగా ఇక ఐపీఎల్కు దూరం అవుతూ ఉండటం.. ఇంకా ఎన్నో ఫ్రాంచైజీ లను ఆందోళనలో ముంచెత్తుతోంది. ఇకపోతే ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తలబడపోతుంది. ఇలాంటి సమయంలో ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది. జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న ఆరోన్ ఫించ్, ఫ్యాట్ కమ్మిన్స్ ఐదు మ్యాచ్ లకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 5వ తేదీన సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా ఆస్ట్రేలియా నుంచి ఇక ఇండియా వచ్చి జట్టు క్యాంపు లో చేరే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్నాళ్లపాటు బయో బబుల్లో ఉండాల్సి కూడా ఉంటుంది. దీంతో ఇక మొదటి ఐదు మ్యాచ్ల కు ఇద్దరు స్టార్ ప్లేయర్ దూరం కాబోతూ ఉండడంతో కోల్కతా కు షాక్ తగిలింది. ఇకపోతే ఈసారి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో కోల్కత నైట్రైడర్స్ ఐపీఎల్ ప్రస్థానం మొదలు పెట్టబోతు ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: