చెన్నై సూపర్ కింగ్స్ కి ఏమైంది.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ లేకపోతే ఇక చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయినట్లేనా.. ఎవరు కూడా ధోనీ లాగా జట్టును ముందుకు నడిపించి లేరా.. ధోని వారసుడిగా పేరున్న రవీంద్ర జడేజా కెప్టెన్సీ చేపట్టినప్పటికీ ఎందుకు కలిసి రావడం లేదు.. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎందుకు చెన్నై జట్టు విజయం సాధించడం లేదు.. ఐపీఎల్లో మేడి జట్టు గా కొనసాగుతున్న చెన్నై జట్టుకు దురదృష్టం వెంటాడుతుందా.. లేక చెన్నై జట్టు పని అయిపోయిందా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

 ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఎక్కువసార్లు ప్లే ఆఫ్ ఆడిన జట్టుగా మాత్రమే కాదు టైటిల్ గెలిచిన జట్టు గా కూడా ఉంది చెన్నై.  ధోనీ సారథ్యంలో ఇక తిరుగు లేదు అనే విధంగానే ప్రస్థానాన్ని కొనసాగించి. అయితే 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకొని జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో ఇప్పటివరకు భోణి కొట్టలేదు అని చెప్పాలి.


 ఐపీఎల్ లో మూడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. మొదట కోల్కతా నైట్రైడర్స్ తో మ్యాచ్ జరుగగా  ఓడిపోయింది. ఇక ఆ తర్వాత లక్నో జట్టుతో మ్యాచ్ జరిగితే 210 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేక పోయింది.. ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. ప్రత్యర్థి పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 126 పరుగులకే కుప్పకూలింది చెన్నై చెన్నై సూపర్ కింగ్స్.  జట్టు లో అందరూ చేతులెత్తేయడంతో శివమ్ దూబే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇలా వరుసగా మూడు ఓటములు చూడటం తో చెన్నై సూపర్ కింగ్స్ కూ ఏమైంది అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: