ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే ఏ జట్టు కి సాధ్యం కానీ  రీతిలో రికార్డులు సృష్టించి ఛాంపియన్ గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు ఇక ఐపీఎల్ సీజన్ లో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా మూడు మ్యాచ్లు ఆడింది. ఈ మూడు మ్యాచ్లలో కూడా ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక ఓటమి చవి చూసింది.  ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర స్థాయిలో ఒత్తిడిలో పడుతుంది ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.


 ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి చేతులెత్తేసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో 54 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోవడం వెనుక ధోని కారణమంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ధోని నెమ్మదైన ఆటతీరు ఓటమికి కారణమంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 36 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లను కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖరారైపోయింది.


 ఈ క్రమంలోనే శివమ్ దూబే మహేంద్రసింగ్ ధోని ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించగా.. వీరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదయింది. అయితే శివం దుబే దూకుడుగా ఆడుతూ ఉంటే ధోని అతనికి సహకరించడం మొదట అందరికీ కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత మాత్రం ధోని ఆసాంతం నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. గత రెండు మ్యాచ్ల్లో ఎంతో స్వేచ్ఛగా బ్యాట్ ఝాలిపించిన  ధోనీ ఎందుకో పంజాబ్ మ్యాచ్ మాత్రం అది రిపీట్ చేయలేకపోయాడు. అయితే నెమ్మది అయిన ఆటతీరు కాకుండా భారీ షాట్లు ఆడి ఉంటే బాగుండేదని  సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారీ పరుగులు చేయాల్సిన స్థితిలో అత్యుత్తమ ఆటగాడిని  బయటకు తీయాలి ధోని అలా చేయలేక పోయాడు అంటు చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl