ఐపీఎల్ హిస్టరీలో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం చేదు అనుభవం ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ అభిమానులు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత మ్యాచ్ లలో గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా తర్వాత మ్యాచ్లో కూడా ఓడిపోయింది. ఇలా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయినట్లేనా అనే చర్చ కూడా జరగడం మొదలైంది. ఇక దిగ్గజ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడంతో అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోయారు అనే చెప్పాలి.


 కనీసం ఐదో మ్యాచ్ లో అయినా గెలుస్తుందా లేదా అనే అపనమ్మకం తోనే టీవీ చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నాలుగు ఓవర్ లో రుతురాజ్ వికెట్ కోల్పోయాడు. దీంతో ఇక మళ్లీ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇక అంతలోనే రాబిన్ ఉతప్ప ఒకవైపు నుంచి శివం దుబే మరో వైపు నుంచి ఎంతో దూకుడుగా ఆడుతూ ఉండడంతో అభిమానులు అందరిలో కూడా ఆశలు రేకెత్తాయి. విజయం సాధిస్తుందో లేదో అని అనుమానం నుంచి విజయం సాధిస్తే బాగుండు అనే వరకు వచ్చారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇద్దరూ భారీ స్కోర్లు చేశారు. ముఖ్యంగా శివమ్ దూబే  46 బంతుల్లోనే వీరవిహారం చేసి 95 పరుగులు చేశాడు.


 అతని దూకుడు చూస్తే ఇక సెంచరీ సాధించడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి నిరాశతో పెవిలియన్ చేరాడు శివమ్ దూబే. అయితే చెన్నై విషయంలో అతనిది ఎంత కీలక పాత్రను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అయితే కొంతమంది అభిమానులు శివమ్ దూబే సెంచరీ మిస్ అయింది అని నిరాశ పడుతూ ఉంటే మరి కొంతమంది అభిమానులు మాత్రం సెంచరీ మిస్ అయితే ఏంటి చెన్నై జట్టుకు మొదటి విజయాన్ని అందించి మా మనసులు గెలిచావు పో అంటు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl