ఇటీవల ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయాన్ని సాధించింది. అది కూడా మామూలుగా కాదండోయ్ డిఫెండింగ్ ఛాంపియన్ అనే పదానికి అర్థం చెబుతూ ఇరవై మూడు పరుగుల తేడాతో మొదటి విజయాన్ని నమోదుచేసింది చెన్నై సూపర్ కింగ్.  చెన్నై సూపర్ కింగ్స్ జోరు చూస్తే మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది అని మాత్రం అర్థమైంది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి వరుసగా విజయాల పరంపర కొనసాగిస్తుంది అంటు చెన్నై సూపర్ అభిమానులు మాత్రం బలంగా నమ్ముతున్నారు అనే చెప్పాలి. ఇక భారీ తేడాతో విజయం సాధించి ఐపీఎల్లో మా వేట మొదలయ్యింది అంటూ ప్రత్యర్థులు  అందరికీ కూడా ఒక సంకేతాన్ని ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.


 ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా చివరి వరకు మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మ్యాచ్ గెలవడంలో అటు రాబిన్ ఉతప్ప మరో వైపు నుంచి శివ దూబే మెరుపు ఇన్నింగ్స్ కారణం అని చెప్పాలి.  రాబిన్ ఉతప్ప 84 పరుగులు శివమ్ దూబే 95 పరుగులతో రాణించారు. ఏకంగా ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక స్కోరు చేయగలిగింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. బెంగళూరు జట్టు లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో కీలకమైన వికెట్లు తీయడంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు ధోని. తన మాస్టర్ ప్లాన్ కి తిరుగు లేదు అని మరోసారి నిరూపించాడు మహేంద్రసింగ్ ధోని.


 ఇప్పటివరకు విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్  ఆడకపోయినప్పటికీ అటు చెన్నై సూపర్ కింగ్ పై మాత్రం  అతనికి సిరి కాదు ఉంది. కానీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కీలక కోహ్లీ వికెట్లు తీయడంలో ధోనీ వేసిన ప్లాన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్ ముఖేష్ చౌదరి కి ఇచ్చాడు ధోని. లెగ్ సైడ్ షార్ట్ లెన్త్ బంతి వేయాలని సూచించాడు. దానికి తగ్గట్లుగానే బ్యాక్వర్డ్ ఫీల్డర్ ను కూడా పెట్టాడు.  కేవలం కోహ్లీ కోసం మాత్రమే అక్కడికి ఫీల్డర్లు తీసుకువచ్చాడు. క్యాచ్ వస్తుంది జాగ్రత్త అప్రమత్తంగా ఉండు అని కూడా హెచ్చరించాడు. ఇక అనుకున్నట్లుగానే అంతా జరిగిపోయింది. సరిగ్గా అతని చేతిలోకి క్యాచ్ వెళ్ళింది. ఆ తర్వాత రీప్లేలో ఇక ఇదంతా చూసిన కోహ్లీ ఆశ్చర్యపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl