ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొని ఫ్రాంచైజీలు కొంతమంది సీనియర్ ఆటగాళ్ళను కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్న ఆటగాళ్ళు జట్టులోకి వస్తే ఇక ఐపీఎల్లో తమకు తిరుగు ఉండదు అని అనుకున్నాయ్ ఆయా జట్ల ప్రాంఛైజీలు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే భారీ అంచనాల మధ్య కోట్లకి కోట్లు ఖర్చు చేసి మరి జట్టులోకి తీసుకున్నా ఆటగాళ్లు పేలవమైన ఫామ్ కారణంగా ప్రతి మ్యాచ్ లో నిరాశ పరుస్తూనే ఉన్నారు. జట్టు విజయాలకు తోడ్పాటు అందించడమే కాదు జట్టుకు భారంగా మారిపోతున్నారు ఎంతో మంది ఆటగాళ్లు.


 ఇలాంటి ప్లేయర్స్ లో మిచెల్ మార్ష్ కూడా ఒకడూ అని చెప్పాలి. స్టార్ ఆల్రౌండర్గా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగు పెట్టాడు మిచెల్ మార్ష్. ఇక ఢిల్లీ జట్టు కి  తిరుగు ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మిచెల్ మార్ష్ పేపవ ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్ లో కూడా పెద్దగా రాణించడం లేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు కు అతను ఒక మైనస్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. కాగా మొదట్లో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తర్వాత మూడు మ్యాచ్ లలో కూడా ఓటమి చవి చూసింది అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


 గత మ్యాచ్ లో పృథ్వీ షా   అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ మార్ష్ కేవలం 24 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 11 డాట్ బాల్స్ ఉంటే మిగతావి కేవలం సింగిల్ రూపంలో మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే అసహనం వ్యక్తం చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతను ఒక విలన్లా దాపురించాడు అంటూ కామెంట్ చేశాడు. గతంలో జట్టు కోసం రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ అవుట్ గా వెనుతిరిగినట్లుగానే మిచెల్ మార్ష్ కూడా తన బ్యాటింగ్ త్యాగం చేసి రిటైర్ ఔట్ గా పెవిలియన్ చేరిన ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణమాచారి శ్రీకాంత్..

మరింత సమాచారం తెలుసుకోండి: