ఇటీవల కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో ఎంతోమంది యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూ  చాలా అద్భుతంగా రాణిస్తూన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వారీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగుతున్న పృధ్వి షా, పంత్  కూడా ఉన్నారు . కాగా ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్గా బరిలోకి దిగుతున్న పృథ్వీ షా  భారీ పరుగులు చేస్తున్నాడు. ఇక ఇద్దరూ కూడా  జట్టుకు వెన్నుముకగా మారిపోతున్నారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే ఇద్దరు క్రికెటర్లు కూడా రానున్న రోజుల్లో టీమిండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకోనున్నారు అని అభిమానులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు టీమిండియా టెస్టు జట్టులో ఉంటే ఇక టీమిండియాకు తిరుగు ఉండదు అంటూ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. విధ్వంసమైన ఆట తీరుతో విరుచుకుపడ్డ ఈ ఆటగాళ్లు కలిసి టీమిండియాకు ఆడితే టెస్ట్ఛాంపియన్ ట్రోఫి ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్  రిషబ్ పంత్ ఇక టెస్టులో తన మార్క్ చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 మరోవైపు పృద్వి షా సైతం వెస్టిండీస్ తో ఆరంగేట్రం చేసిన మ్యాచ్లోనే అదరగొట్టే ప్రదర్శన చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.  ఇక టీమిండియా టెస్టు జట్టు తరఫున చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన పృద్వి షా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ పృద్వి  షా, పంత్ టెస్ట్ క్రికెట్ లో అసలైన మజా అందించగలరు అంటూ చెప్పుకొచ్చాడు. పృథ్వీ షా తో పాటు పంత్ జట్టులో ఉన్నాడు అంటే ప్రత్యర్థి జట్టుకు కనీసం 400 స్కోర్ చేయాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరు జట్టులో ఉంటే కచ్చితంగా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ టీమిండియా గెలుస్తుంది అంటూ  వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: