సాధారణంగా టి20 ఫార్మాట్ అంతే అటు బ్యాట్స్ మెన్ లదే ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి వుంటుంది. అలా చేస్తేనే అటు తాము ఆడుతున్న జట్టుకి మంచి స్కోర్ అందించిన ఆటగాడిగా పేరు సంపాదించుకుంటారు. అందుకే ఇక క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సింగిల్ తీయాలని కాదు సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోవాలి అనే మైండ్సెట్ తోనే ఇక బ్యాట్ ఝలిపించటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 కాగా టి-20 ఫార్మాట్లో పవర్ ప్లే అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రత్యర్థి ఫీల్డర్లు అందరూ కూడా కేవలం ఒక సర్కిల్ లో ఉంటారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే సర్కిల్ బయట ఉంటారూ. దీంతో  ఎంతో సులభంగా సిక్సర్లు ఫోర్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక పవర్ ప్లే బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్లు తమకు కుదిరినంత పరుగులు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలో బ్యాట్స్మెన్లు పరుగులు చేయకుండా డాట్ ఫాల్స్ వేయడం అంటే అది ఎంతో ప్రతిభ తో కూడుకున్న విషయం అని చెప్పాలి. ఇలాంటి విషయంలోనే తాను తోపు అని నిరూపించుకున్నాడు భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.



 టి-20లో పవర్ ప్లే లో అత్యధిక డాట్ బాలన్స్ వేసిన బౌలర్గా ప్రస్తుతం ప్రపంచ రికార్డును సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భువనేశ్వర్ కుమార్ 65 మ్యాచ్ లలో ఏకంగా 502 డాట్ బాల్స్ వేశాడు. తన బంతులతో బ్యాట్స్మెన్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో టాప్ లో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ తర్వాత శామ్యూల్ బద్రి 50 మ్యాచ్ లలో 383 డాట్ బాల్స్ వేశాడు  తర్వాత టీం సౌదీ 68 మ్యాచ్ లలో 368 డాట్ బాల్స్ వేయటం గమనార్హం. మిచెల్ స్టార్క్ 51 మ్యాచుల్లో 354 డాట్ బాల్స్.. కులశేఖర 43 మ్యాచ్ల్లో 324 డాట్ బాల్స్ తో లిస్టులో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: