
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా యాజమాన్యం చేసిన ప్రయోగాల పై అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ స్పందించాడు. 1990లలో పాకిస్థాన్ జట్టు కూడా ఇదే విధంగా కెప్టెన్ లను మారుస్తూ వచ్చింది అంటూ గుర్తు చేశాడు రషీద్ లతీఫ్.. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు యాజమాన్యం చేసిన తప్పును ఇక ఇప్పుడు టీమిండియా యాజమాన్యం చేస్తోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా గత ఎనిమిది నెలల నుంచి టీమిండియాలో ఏడుగురు సారథులు మారారు.
ప్రస్తుతం అందరూ బ్యాకప్ కెప్టెన్ ల గురించి మాట్లాడుతున్నారు. భారత్ మాత్రం గత ఏడాది నుంచి ఏకంగా ఏడుగురు కెప్టెన్ లని మార్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ని చూడటం ఇదే మొదటిసారి. అయితే ఇది ఏమాత్రం జట్టుకు మంచిది కాదు గతంలో పాకిస్థాన్ చేసిన తప్పులు ఇక ఇప్పుడు టీమిండియా చేస్తున్నట్లు అనిపిస్తోంది. భారత జట్టుకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలి అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే 1990 లలో కూడా పాకిస్తాన్ ఇలాగే తమ కెప్టెన్ లను మార్చింది. 1992 లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ ప్రపంచకప్ గెలుచుకున్న తర్వాత ఇమ్రాన్ కాకుండా ఎనిమిది మంది పాకిస్తాన్ కెప్టెన్సి చేపట్టడం గమనార్హం.