
22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టి20 లలో భారత క్రికెటర్లలో అత్యంత వేగంగా అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న బ్యాట్స్మెన్ గా రెండవ స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు ఎవరు ఉన్నారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
ఇప్పుడు వరకు ఈ రికార్డును ఎవరో బ్రేక్ చేయలేదు. తర్వాత కేఎల్ రాహుల్ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని రెండవ స్థానంలో ఉన్నాడు. ఇటీవల సూర్య కుమార్ యాదవ్ 18 బంతుల్లోనే సౌత్ ఆఫ్రికా పై హాఫ్ సెంచరీ సాధించి కేఎల్ రాహుల్ తో సమానంగా కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ శ్రీలంక పై 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు, యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియా , శ్రీలంకపై 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.