టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది పాకిస్తాన్ జట్టు. ఏకంగా పటిష్టమైన భారత చేతిలో ఓడిపోవడమే కాదు పసికూన జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోయి అటు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో అటు పాకిస్తాన్ విజయం సాధించినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని చెప్పాలి.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ గెలుపు ఓటమి గురించి పక్కన పెడితే.. అటు కెప్టెన్ బాబర్ అజాం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ అజం ఈ ఏడాది వరల్డ్ కప్ లో మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు పాకిస్తాన్ మూడు మ్యాచ్లు ఆడగా మూడు మ్యాచ్లు కూడా ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు బాబర్ అజామ్. ఇక కెప్టెన్గా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో వెంటనే బాబర్  ను కెప్టెన్ గా తప్పించాలి అంటూ ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.


 ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం ఆట తీరుపై ఇటీవల టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్వలాభం కోసం కాకుండా జట్టు విజయాల కోసం బాబర్ ఆలోచిస్తే బాగుంటుంది అంటూ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతను ఓపెనర్ గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఓపనర్ గా అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. జట్టు మేలు కోసం బాబర్  తన స్థానంలో ఫకర్ జమాన్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. దీనినే స్వార్థం అంటారు. కెప్టెన్ ఎప్పుడు స్వార్థపూరితంగా ఆలోచించకూడదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: