ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల రారాజుగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పటికీ కూడా అదే ఊపును కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల విషయం లో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లు గానే విరాట్ కోహ్లీ దూసుకు పోతూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు.



 అయితే ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఒక అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి. ఏకంగా ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును కొట్టే సాడు విరాట్ కోహ్లీ. అంతకు ముందు జయవర్ధనే  పేరిట ఈ రికార్డు ఉండగా.. ఇక దానిని బ్రేక్ చేసి తన పేరున ఈ రికార్డు లిఖించు కున్నాడు అని చెప్పాలి.


 ఇక పోతే విరాట్ కోహ్లీ ఈ అరుదైన రికార్డు సాధించడం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ సైతం స్పందిస్తూ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే ఎంతో రిస్క్ తో కూడుకున్నది.. అందులోను బ్యాటింగ్ అంటే మరీ కష్టం. అలాంటిది ఇన్ని మ్యాచులలో కోహ్లీ నిలకడగా రాణించడం ఊహకే అందడం లేదు. అతడి గణాంకాలు చూస్తుంటే చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కోహ్లీ దేశం కోసం ఎంతో సాధించి పెట్టాడు అంటూ షేన్ వాట్సన్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: