సాధారణంగా ఏదైనా మెగా టోర్ని జరుగుతుందంటే ఆ టోర్నికి ఆతిథ్యం వహిస్తున్న జట్టు అద్భుతంగా రాణిస్తుంది అనే అంచనాలు ప్రేక్షకులలో నిండిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఆ దేశంలో మైదానాల్లో ఉండే పరిస్థితులు ఇలా స్వదేశీ ఆటగాళ్లకు బాగా తెలిసి ఉంటాయి. ఇక ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని బాగా రాణించేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటిది ఎక్కడ జరగలేదు. ఇటీవలే ఖాతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఘనంగా ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఎన్నో జట్లు అద్భుతంగా రాణిస్తూ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అటు వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ జట్టు మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమి చవిచూసిన ఖాతార్ జట్టు లీగ్ దశ నుంచే అటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా ఏకంగా ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఆతిథ్య జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.


 ఇలా ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించి అభిమానులు అందరిని కూడా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన ఖతార్ జట్టు ఇక ఇప్పుడు మరో చెత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ఆతిథ్య జట్టుగా ఖాతార్ నిలిచింది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమి చవిచూసిన ఖాతార్ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఒక్క గోల్ కూడా కొట్టకుండా కనీస పోటీ ఇవ్వకుండా ఓటమి పాలయ్యింది. దీంతో టోర్నీలో ఒక్క పాయింట్ కూడా సాధించకుండా నిష్క్రమించిన ఏకైక జట్టుగా ఖాతార్ చెత్త రికార్డును సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: