
కానీ చివరికి సౌరాష్ట్ర చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సౌరాష్ట్ర ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (50) మరియు షెల్డన్ జాక్సన్ లు మొదటి వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే వెంటనే మరో వికెట్ జయ్ గోహిల్ రూపంలో కోల్పోవడంతో ఒక్కసారిగా సౌరాష్ట్ర క్యాంపు లో నిరాశ కలిగింది.కానీ ఒకవైపు వికెట్లు పడుతున్నా షెల్డన్ జాక్సన్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు ఘన విజయాన్ని అందుకున్నాడు. షెల్డన్ జాక్సన్ అజేయంగా 133 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనితో విజయ్ హజారే ట్రోపీ 2022-23 సీజన్ కు టైటిల్ ను సౌరాష్ట్ర అందుకుంది.
షెల్డన్ జాక్సన్ ఇతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు మరియు 5 సిక్సులు ఉన్నాయి. ఇక ఇతను ఈ సీజన్ లో సరిగా ఆడకపోయినా , రంజీల్లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. కాగా ఇతను ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చే సీజన్ కు కోల్కతా యాజమాన్యం ఇతనిపై నమ్మకం ఉంచి రీటైన్ చేసుకోవడం విశేషం. మరి వచ్చే సీజన్ లో అయినా తన సత్తా చాటుతాడా అన్నది చూడాలి.