ఖతార్ వేదికగా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎన్నో రోజుల నుంచి ఇక ఈ మెగాటోర్ని కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులు అందరూ కూడా ఇక ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లను వీక్షిస్తూ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ప్రేక్షకుల ఊహకందని ఫలితాలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయ్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు సైతం ఇక పేలవ ప్రదర్శన కారణంగా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమిస్తూ ఉంటే అనామక జట్లు మాత్రం వరుసగా పాయింట్లు సాధిస్తూ దూసుకుపోతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


 ఇక ఇలాంటి ఫలితాలు అటు ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై కూడా ప్రేక్షకులు ఒక అంచనాలకు రాలేకపోతున్నారు. దీంతో ఇక ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్లను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకంగా ఫిఫా వరల్డ్ కప్ కి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో కూడా ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు ఆసక్తి చూపడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కావొద్దు అనుకున్నాడో ఏమో ఏకంగా తనకు సర్జరీ ఉందని తెలిసిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను చూసేందుకు సిద్ధమయ్యాడు.


 పోలాండ్ కు చెందిన ఒక ఫుట్బాల్ గేమ్ అభిమాని తన ఆపరేషన్ సమయంలో ఫిఫా వరల్డ్ కప్ ను చూసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ డాక్టర్లను కోరాడు. ఇక డాక్టర్లు కూడా ఇందుకు అనుమతి ఇచ్చారు అని చెప్పాలి. ఇకపోతే ఒకవైపు వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో మరోవైపు బెడ్ మీద పడుకున్న పేషెంట్ ఇక ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వీలుగా ఒక టీవీని ఏర్పాటు చేశారు. ఇలా వైద్యులు ఆపరేషన్ చేస్తుంటే అటు పేషెంట్ మాత్రం ఫిఫా వరల్డ్ కప్ చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: