ఫుట్బాల్ ప్రపంచ కప్ లో అదో దిగ్గజ జట్టు.. ఇప్పటివరకు ఏకంగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ  ఐదుసార్లు వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది అని చెప్పాలి. అలాంటి బ్రెజిల్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరిసారిగా 2002లో వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టు అప్పటినుంచి ప్రతి ప్రపంచ కప్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఉసూరుమనిపిస్తుంది అని చెప్పాలి. 2006 నుంచి వరుసగా మూడు టోర్నీలలో క్వార్టర్ ఫైనల్స్ లో ఓడి ఇంటి బాట పట్టింది. ఇక 2014లో మాత్రం సెమీస్ వరకు వెళ్ళింది. 2022 ప్రపంచ కప్ లో కూడా మరోసారి సెమి ఫైనల్ వెళ్లకుండానే ఇంటిపాటు పట్టింది అని చెప్పాలి.


 ఇటీవల క్రోయేసియాతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన బ్రెజిల్ జట్టు మరోసారి నిరాశ పరిచింది. ఇక టోర్ని నుంచి నిష్క్రమించే పరిస్థితిని తీసుకొచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే బ్రెజిల్ ఓడిపోయి ఇంటి బాట పట్టిన నేపథంలో ఆ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న నెయిమార్ రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడా అనే అనుమానాలు తెరమీదికి వచ్చాయి. క్రోయేషియాతో జరిగిన మ్యాచ్లో ఒక గోల్ కొట్టాడు నెయిమార్. కానీ మ్యాచ్ ఓడిన తర్వాత అతడు మాట్లాడిన మాటలు వింటే మాత్రం ఇక మళ్ళీ అతను జాతీయ జట్టు తరుపున ఆడటం కష్టమే అన్నది మాత్రం అర్థం అవుతుంది.


 నిజంగా నాకు కూడా దాని గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదేమో. ఈ సమయంలో నేను సరిగ్గా ఆలోచించడం లేదు. ఓటమి అయితే నన్ను తీవ్రంగా కలిచి వేసింది. మునుముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను దాని గురించి ఆలోచించాలి. నేను ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటా.. బ్రెజిల్ తరఫున ఆడను అని మాత్రం చెప్పను. కానీ తిరిగి దేశం తరఫున ఆడతానని కూడా 100% చెప్పలేకపోతున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఇక వరల్డ్ కప్ లో ఓటమి నేపథ్యంలో త్వరలో నెయిమార్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అన్న చర్చ మొదలైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: