
ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుండి మొదలైన రెండవ టెస్ట్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే మొదటి టెస్ట్ లోలాగా ముల్తాన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించకపోగా స్పిన్ కు దాసోహంగా మారింది. ఫలితం ఇంగ్లాండ్ కేవలం 281 పరుగులకే ఆల్ అవుట్ అయింది. డక్కెట్ (63) మరియు పొప్ (60) అర్ధసెంచరీలు చేసి జట్టును ఆదుకున్నారు. ఇక మొదటి టెస్ట్ ఆడుతున్న అబ్రార్ అహ్మద్ 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్ కు చేపట్టిన పాకిస్తాన్ ఇంగ్లాండ్ కన్నా దారుణంగా 202 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ లో బాబర్ అజాం (75) మరియు షకీల్ (63) లు అర్ద సెంచరీలు చేసి ఆమాత్రం స్కోర్ అయినా చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ లలో జాక్ లీచ్ 5, మార్క్ వుడ్ 2 మరియు రూట్ 2 వికెట్లు తీసుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 275 పరుగులు చేసి పాకిస్తాన్ ముందు 355 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హ్యారి బ్రూక్ 108 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. ఇంగ్లాండ్ విసిరినా లక్ష్యాన్ని చేధించబోయి పాకిస్తాన్ 26 పరుగుల దూరంలో ఆల్ అవుట్ అయ్యి మ్యాచ్ ను మరియు సిరీస్ ను పోగొట్టుకుంది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన హర్రీ బ్రూక్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.