సాధారణంగా భారత్ లో పుట్టిన ఆటగాళ్లు ఎవరైనా సరే భారత జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రేంజ్ లో ఇక భారత్లో క్రికెట్ కి క్రేజ్ ఉంది. కానీ భారత్ లో పుట్టిన ఆటగాళ్లు ఏకంగా విదేశీ జట్టుకు ఆడటం గురించి ఏప్పుడైనా విన్నారా.. ఇక్కడొక ఆటగాడు విషయంలో ఇదే నిజం అయింది. అతని పేరు కొలిన్ కౌడ్రి. భారత్లో పుట్టిన అతను ఏకంగా ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడి అదరగొట్టాడు అని చెప్పాలి.


 సరిగ్గా క్రిస్మస్ పండుగ ముందు అతను ఇక పండుగ సంబరాలు చేసుకునేందుకు అంత సిద్ధం చేస్తుండగా... అతని ఫోన్ రింగ్ అయింది. ఇక ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే ఇంగ్లాండ్ సెలెక్టర్ల నుంచి ఫోన్ కాల్ దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంకేముంది ఆ ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఆస్ట్రేలియా కు టికెట్ తీసుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లీష్ జట్టును గాయాల బెడద ఎక్కువగా వేధిస్తుంది.  దీంతో ఇక కోలిన్ పిలుపు అందించారు ఇంగ్లాండ్ సెలెక్టరు. ఇక 42 సంవత్సరాల వయస్సులో డేన్నిస్ లిల్లీ, జఫ్ థామ్సన్ వంటి ప్రమాదకరమైన బౌలర్లతో జత కలిశాడు కొలిన్.



 సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇలా భారత్ లో పుట్టిన కొలిన్ ఇంగ్లాండు జాతీయ జెండాలో చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇలా మొదటి మ్యాచ్ లో 22 పరుగులు.. ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో 41 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు.  ఇక ఇలా కొలిన్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే అటు ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చూసింది. అప్పటినుంచి 1975 వరకు ఇంగ్లాండ్ తరఫున నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడగా ఆడాడు అని చెప్పాలి. ఇక మొత్తంగా ఇంగ్లాండ్ జట్టు తరఫున 114 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కొలిన్ 7624 పరుగులు చేశాడు. 1932 డిసెంబర్ 24న తమిళనాడులో జన్మించాడు కొలిన్ కౌడ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: