ఫుట్ బాల్ ఆటకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ క్రేజ్ కు తగ్గట్లుగానే అటు ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్ల సంపాదన కూడా ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఒకవైపు ఫుట్బాల్ ఆడటం ద్వారా మాత్రమే కాదండోయ్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉంటారు ఎంతో మంది స్టార్ ప్లేయర్స్. అదే సమయంలో ఇక ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగిందంటే చాలు విజేతకు దక్కే ప్రైజ్ మనీ కూడా అంతే భారీగా ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఖతార్ వేదికగా  ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైంది.


 ఎన్నో రోజుల నుంచి ఈ వరల్డ్ కప్ కోసం నిరీక్షణగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇక ఈ మెగా టోర్ని అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఇక ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 18వ తేదీన అర్జెంటీనా ఫ్రాన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే గతంలో ఈ రెండు జట్లు కూడా రెండు సార్లు ఛాంపియన్ జట్లుగా నిలిచాయి. 1978, 1986లో అర్జెంటీనా టైటిల్ విజేతగా ఉంటే.. 1998, 2018లో ఫ్రాన్స్ విశ్వవిజేతగా మారింది.


 ముచ్చటగా మూడోసారి ఇక టైటిల్ గెలవాలని లక్ష్యంతో ఉన్నాయి ఈ రెండు జట్లు.  ఈ క్రమంలోనే టైటిల్ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ గెలిచే విజేతకు ప్రైజ్ మనీ ఎంత అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు చూసుకుంటే విజేతకు 4.2 కోట్ల డాలర్లు అంటే సుమారు 347 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ దక్కుతుంది. ఇక రన్నరప్ గా నిలిచిన టీం కి మూడు కోట్ల డాలర్లు.. అంటే 246 కోట్లు దక్కుతాయి. కాగా ఫుట్బాల్ ఆటలో ఇక వరల్డ్ కప్పే అత్యుత్తమమైన టోర్నీగా కొనసాగుతుంది. అందుకే ప్రైజ్మనీ ఇంత భారీ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: