సాధారణంగా ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఎంతో వ్యూహాత్మకంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మైదానంలో ఉన్న పరిస్థితులను మాత్రమే కాదు ఏకంగా పాత సెంటిమెంట్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి.  ఇక ఇలా సెంటిమెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగితే మాత్రం చివరికి కొన్ని కొన్ని సార్లు పరాజయం పాలు కావడం జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ లీగ్ లో భాగంగా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.


 ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మరోసారి పాత సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇప్పటివరకు ఇక ఈ లీగ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే విజేతగా నిలుస్తూ వచ్చింది అని చెప్పాలి. కానీ ఇటీవల ఏకంగా టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ ఎంచుకోకుండా మొదట ఫీల్డింగ్  చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు. దీంతో కెప్టెన్ నిర్ణయం జట్టు కొంపముంచింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మేల్ బోర్న్ రెనగెడ్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదట బ్రిస్బెన్ జట్టు టాస్ గెలిచింది.


 అయితే ఇక బ్రిస్బేన్  కెప్టెన్ గా ఉన్న జమ్మి పెర్సన్ ముందుగా బౌలింగ్ చేస్తాము అంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయమే జట్టు కొంప ముంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన మేల్ బోర్న్ జట్టు విరుచుకు పడింది అని చెప్పాలి. ఇక ఆ జట్టు కెప్టెన్ అయిన నిక్ మ్యాడిన్సన్ 49 బంతుల్లో 87 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అతనికి తోడుగా రస్సెల్ 35 సామ్ హార్బర్ 21 పర్వాలేదనిపించారు అని చెప్పాలి. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  166 పరుగులు చేసింది మేల్ బోర్న్ జట్టు. తర్వాత లక్ష్య చేదనకు దిగిన బ్రిస్బేన్  ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో  ఓటమి తప్పలేదు అయితే. కాగా ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుస్తుండగా... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఏంటి అని జిమ్మీ పెర్సన్ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: