సాధారణంగా ఈ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న వారు ఎప్పుడూ తమ బ్యాటింగ్తో భారీ స్కోర్ చేయడం చూస్తూనే ఉంటామూ. కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక తక్కువ పరుగులకే  పెవిలియన్ చేరడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు మాత్రం జట్టులో స్టార్  బౌలర్లు సైతం ఇక తమ బ్యాటింగ్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల తరహా లోనే భారీ సిక్సర్లు బాదుతూ రికార్డులను కూడా సృష్టిస్తూ ఉంటారు.


 ముఖ్యంగా ఇప్పటివరకు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతో మంది స్టార్ బౌలర్లు జట్టుకు అవసరమైనప్పుడల్లా కూడా తమ బ్యాటింగ్ తో కూడా మెరుపులు మెరుపుంచిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు ఎన్నోసార్లు బ్యాట్ తో జట్టును ఆదుకున్నాడు. ఒకానొక సమయంలో బుమ్రా సైతం ఒకే ఓవర్ లో భారీగా పరుగులు సాధించిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించారు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ సైతం తన బ్యాటింగ్ తో ఆశ్చర్యపరిచాడు.



 తొలి టెస్ట్ మ్యాచ్లో  భారత స్టార్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ చివర్లో బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అంతకుముందు బౌలింగ్లో ఒక వికెట్ తీసి పరుగులు కట్టడి చేసిన ఉమేష్ యాదవ్ ఇక చివర్లో బ్యాటింగ్కు వచ్చి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెహదీ హసన్ బౌలింగ్లో ఉమేష్ యాదవ్ కొట్టిన ఒక భారీ సిక్సర్ కాస్త అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తరహాలోనే 101 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు ఉమేష్ యాదవ్. ఇక ఇది చూసిన తర్వాత ఉమేష్ యాదవ్లో ఇలాంటి టాలెంట్ కూడా దాగి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అంతకు ముందు కుల్దీప్ యాదవ్ 40 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: