ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచిన  ఫిఫా వరల్డ్ కప్ ఇటీవల ముగిసింది. ఫిఫా వరల్డ్ కప్ సాధించేందుకు ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు  హోరాహోరీగా పోరాడాయ్. చివరికి స్టార్ ప్లేయర్ మెస్సి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా జట్టు విశ్వవిజేతగా నిలిచింది.. ఎన్నో రోజుల నుంచి అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ మెస్సి తన కెప్టెన్సీలో జట్టుకు టైటిల్ అందించి మూడవసారి అర్జెంటీనా జట్టును విశ్వవిజేతగా నిలిపాడు అని చెప్పాలి. అయితే ఫైనల్ పోరులో భాగంగా ఒకవైపు లియోనల్ మెస్సి మరోవైపు కెలియాన్ ఎంబాపే మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.


 అర్జెంటీనా తరఫున మెస్సి గోల్ చేస్తే ఇక కెలియాన్ ఎంబాపే సైతం ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గోల్డెన్ బూట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ కెలియాన్ ఎంబాపే చేసిన అద్భుతమైన ప్రదర్శన గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక సదరు ఆటగాడికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా కెలియాన్ ఎంబాపే గర్ల్ ఫ్రెండ్ లింగ మార్పిడి చేసుకుంది అన్న  విషయం బయటికి వచ్చింది  కెలియాన్ ఎంబాపే స్నేహితురాలు ఇనెస్ రౌ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.  ఆమె ఇక ఈ విషయం చెప్పడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ సమయంలో ఇక అంబాపేతో రిలేషన్ షిప్ లో ఉన్న ఉన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు  ఇటీవల కెన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో ఇక వీరబంధం గురించి బయటికి వచ్చింది.


 ఇక ప్రస్తుతం ఆమె మోడలింగ్ రంగంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  కాగా సోషల్ మీడియాలో కూడా ఆమెకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇనెస్ రౌ ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా స్టార్ ప్లేయర్ అంబాపే ఏకంగా లింగమార్పిడి చేసుకున్న అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: