భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ప్రక్రియ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎవరు ఎక్కువ ధర పలుకుతారు అన్న విషయంపై ఎన్నో అంచనాలు ఉండగా ఎవరి అంచనాలకు అందని విధంగా కొత్త ఆటగాడు భారీ ధరను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఇక ఆ యువ ఆటగాడికి భారీ ధర పెట్టేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రావడం కష్టమే అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో మరోసారి అతని విషయంలో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.


 ఇప్పుడు వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఏ ఆటగాడికి పలకనంత ధర అతనికి పలికింది. దీంతో అతను సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ఇంతకీ ఇలా అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న సామ్ కరణ్. గత కొంతకాలం నుండి అత్యుత్తమమైన ఫామ్ లో  కొనసాగుతూ.. అటు మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో కూడా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ జట్టు అతనికోసం పోటీపడి మరీ 18.50 కోట్లకు దక్కించుకుంది.


 కాగా ఇప్పటివరకు ప్యాట్ కమ్మిన్స్  16.25 కోట్లే అత్యధిక ధరగా ఉండగా   ఇక ఇప్పుడు ఆ రికార్డును సామ్ కరణ్ బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు అనే విషయం తెలిసింది. అయితే మినీ వేలంలో తనకు భారీ ధర పలకడం గురించి ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందించాడు సామ్ కరణ్. ఎక్కడ మొదలైందో మళ్లీ తిరిగి అక్కడికే వచ్చాను. ఇక ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సమయంలో మొదటిసారి పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు సామ్ కరణ్. ఆ తర్వాత గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: