ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా జట్టు అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. మొదట వన్డే సిరీస్ లో ఓడిపోయి తీవ్రంగా నిరాశపరిచిన టీమ్ ఇండియా జట్టు.. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది టీమిండియా. ఇక రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లో విజయం సాధించి బంగ్లాదేశ్ పై పూర్తి ఆదిపత్యం సాధించింది. ఈ క్రమంలోనే 2-0 తేడాతో బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేయడంతో ఇక టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో అవకాశాలు మరింత మెరుగయ్యాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించి సిరీస్ కైవసం చేసుకోవడంపై అటు టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ ఇక ఈ టెస్టు సిరీస్ లో భాగంగా అవార్డులు ఇచ్చిన తీరు మాత్రం ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు అంటూ టీమ్ ఇండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కుల్దీప్ యాదవ్ నిలిస్తే రెండవ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మాత్రం ఎవరూ ఊహించిన విధంగా పూజార అందుకోవడం గమనార్హం.


 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో నాలుగు వికెట్లు ఇక రెండవ టెస్టు మ్యాచ్ లో రెండు వికెట్లతో పాటు కీలకమైన 42 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు అశ్విన్. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి అతను అర్హుడు అని చెప్పాలి. అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం శ్రేయస్ అయ్యర్ కు దక్కుతుందని అందరూ అనుకున్నారు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 87 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పంత్ తో కలిసి 86 పరుగుల వద్ద అవుటయి జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించాడు. ఇక తర్వాత రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా అశ్విన్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కుతుందనుకున్నప్పటికీ పూజారను ఆ అవార్డు వరించింది.  కళ్ళు కనిపించడం లేదా పూజార ఏం చేశాడని అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కట్టబెట్టారంటూ కొంతమంది బ్రాడ్కాస్టర్లపై గరం గరం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: