ఈ ఏడాది భారత జట్టులోని ఆటగాళ్లు అందరూ ఎంత నిర్విరామంగా క్రికెట్ ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ఐపీఎల్ మొదలుకొని మరోవైపు మూడు ఫార్మాట్ లో కూడా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా గడిపారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎంతో మంది ఆటగాళ్లు అత్యద్భుతమైన ప్రదర్శనతో తెరమిదికి వచ్చి ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా జట్టు ఇక 2022 ఏడాదిని ఎంతో ఘనంగా ముగించుకుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక వచ్చే ఏడాదిలో కూడా మళ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడెందుకు సిద్ధమవుతుంది. టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్ళు పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక 2022 ఏడాది దాదాపు ముగిసినట్లే ఇక ఇప్పుడు టీమిండియా కొత్త ఏడాదిలోనే మ్యాచ్లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొత్తంలో వరుస అవకాశాలు అందుకొని మూడు ఫార్మాట్లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి .


 ఇక ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే... భారత్ తరపున అన్ని ఫార్మాట్లల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా ట్రబుల్ షూటర్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. శ్రేయస్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 40 ఇన్నింగ్స్ లలో 1732 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే 1609 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇందులో ఒక సెంచరీ 14 అర్థ సెంచరీలు ఉండటం గమనార్హం. ఇక శ్రేయస్  తర్వాత స్థానంలో సూర్య కుమార్ యాదవ్ 1424 పరుగులతో కొనసాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 1380 పరుగులు, ఇక విరాట్ కోహ్లీ 1348 పరుగులు, రోహిత్ శర్మ 995 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: