ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన టెస్ట్ మ్యాచ్లో రెండవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఎంత ఉత్కంఠ ఫలితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ పరుగులకే టీమిండియా కీలకమైన వికెట్లు చేజార్చుకున్న సమయంలో ఇక ఓటమి దరి చేరుతుందేమో అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో సీనియర్ బౌలర్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల కాలంలో టీమిండియాలో ట్రబుల్ షూటర్ గా పేరు సంపాదించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా తమ అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు అన్న విషయం తెలిసిందే.


 క్రీజులో నిలబడటమే కష్టం అనుకుంటున్న సమయంలో ఎంతో ఆచీతూచి ఆడుతూ ఇక స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించారు. కీలకమైన సమయంలో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించి ఇక జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయస్ - రవిచంద్రన్ అశ్విన్ జోడి పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం ఇక రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ జోడి పై పొగడ్తల వర్షం కురిపించాడు. టర్నింగ్ పిచ్ పై 8వ వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించడం అద్భుతం అంటూ కొనియాడాడు.


 ఇక ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరుకు భారత్ మరింత చేరువైంది అంటూ సునీల్గా గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఇద్దరు కూడా క్రీజ్ లో పాతుకుపోయి ఎంతో ఏకాగ్రతతో ఆడుతూ ఇక నిశ్శబ్దంగా భారత్ ను గెలిపించారు. బయట ఉన్న ప్రేక్షకులకే టెన్షన్ ఉంది అలాంటిది క్రీజులో ఉన్న వాళ్ళకి చెప్పలేనంత ఒత్తిడి ఉండడం సహజం. చాలామంది అభిమానులు కేవలం అశ్విన్ బౌలింగ్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అతనికి టెస్టుల్లో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధించాడో ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్ తో మనకు నిరూపించాడు అంటూ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: