టీమిండియా క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతుంది ఎవరు అంటే అందరూ టక్కున చెప్పేస్తారు మహేంద్ర సింగ్ ధోని అని. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లు టీమిండియా కు సారధ్య బాధ్యతలు వహించినప్పటికీ ఎన్నోసార్లు ద్వైపాక్షిక సిరీస్లలో విజయాలు సాధించినప్పటికీ అటు అందరూ చెప్పుకునే ఐసీసీ ట్రోఫీలు అందించింది మాత్రం మహేంద్రసింగ్ ధోని అని చెప్పాలి. ఏకంగా అన్ని ఫార్మాట్లలో కూడా ఐసీసీ ట్రోఫీ అందించిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు ధోని.


 ఇలా దిగ్గజ సారధిగా కొనసాగుతూ ఉండడమే కాదు ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫినిషర్ గా కూడా మహేంద్రసింగ్ ధోనీకి పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. కనీసం పరుగులు రాబట్టడం కూడా కష్టం అనుకుంటున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో బరిలోకి దిగే మహేంద్ర సింగ్ ధోని ఎంతో అలవోకగా తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ఇక వికెట్ల వెనకాల ఉంటూ తన మెరుపు వికెట్ కీపింగ్ తో ప్రత్యర్థులకు  షాక్ ఇస్తూ ఉంటాడు. అందుకే ఎంతో మంది యువ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీని స్పూర్తిగా తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు తమను ఎవరైనా ధోనితో పోల్చితే అలాంటి దిగ్గజంతో మమ్మల్ని పోల్చవద్దు అంటూ సూచిస్తూ ఉంటారు.


 కానీ ఇక్కడ ఒక యువ ఆటగాడు మాత్రం తనను ధోనితో పోల్చుతూ మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది అంటూ వ్యాఖ్యానించాడు. మాజీ కెప్టెన్ ధోని గ్రౌండ్లో బయట కూడా అందరితో కలివిడిగా ఉంటాడని.. అతని నుంచి నేర్చుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. అయితే ధోనితో పాటు తాను కూడా ఝార్ఖండ్ నుంచే రావడంతో తనను ఎంతో మంది ధోనితో పోల్చడం చేస్తున్నారని.. అయితే ఇది నాకు నచ్చింది అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ధోనితో పోల్చడం వల్ల తనలోను ఏదో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని అనిపిస్తుంది అంటూ తెలిపాడు. అయితే ధోని సాధించిన దాంట్లో కనీసం 70 శాతం సాధించిన నా కెరియర్ కు అది చాలు అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: