ఇండియన్ మెన్ క్రికెట్ లో ఎందరో ఆటగాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించి చిరస్మరణీయమైన విజయాలను మరియు టైటిల్ లను అందించి ఉన్నారు. అటువంటి ఆటగాళ్లలో ఒకరే యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ రిషబ్ పంత్... ఢిల్లీ నుండి వచ్చిన డాషింగ్ ఆటగాళ్లలో పంత్ ఒకడు. అతి తక్కువ వయసులోనే ధనాధన్ ఇన్నింగ్స్ లను అలవోకగా ఆడి ఇండియా టీం లో చోటును దక్కించుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ , వన్ డే మరియు టీ 20 ఫార్మాట్ లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్  లోనూ తన సొంత టీం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎందరో సీనియర్ లు జట్టులో ఉన్న కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

అయితే తాజాగా రిషబ్ పంత్ బాంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను ముగించుకుని ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీకి వెళుతున్న దారిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సమయానికి ఆ రోడ్ పక్కన మనుషులు ఉండబట్టి పంత్ కు అతి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. రిషబ్ పంత్ అభిమానులు సేవ్ చేసిన వ్యక్తిని సోషల్ మీడియా వేదికగా పొగడతలతో ముంచెత్తుతున్నారు. కాగా రెండు రోజుల నుండి పంత్ హాస్పిటల్ లో చికిత్సను పొందుతున్నాడు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన రిషబ్ పంత్ అభిమానులు అందరూ ఆయనను త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు.

ఇక బీసీసీఐ, టీం ఇండియా ఆటగాళ్లు మరియు విదేశీ ఆటగాళ్లు కూడా పంత్ పరిస్థితి పట్ల భాదపడుతూ దైర్యం చెబుతూ అతి త్వరలోనే కోలుకుని మైదానంలో దిగాలని ప్రార్థిస్తున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ కీలక విషయం చెప్పారు. పంత్ త్వరగా కోలుకుంటాడని నమ్మకంతో ఉన్నామంటూ తెలిపారు.. కాగా తాజాగా పంత్ నవ్వుతూ మాట్లాడుతున్నాడని శుభవార్తను చెప్పాడు. ఈ వార్త విన్న అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: