ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన జట్లలో టీమిండియా ఒకటిగా కొనసాగింది అన్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ఆటగాళ్ళతో ఎంతో పటిష్టంగా కనిపించిన టీమిండియా జట్టు 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుంది  అని అందరూ అనుకున్నారు. వరల్డ్ కప్ టైటిల్ సాధించి 130 కోట్ల మంది కలను సాకారం చేస్తుందని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక మొదటి ప్రయత్నంలోనే అటు భారత జట్టుకు కూడా వరల్డ్ కప్ అందిస్తాడని ఎంతో బలంగా నమ్మారు అందరూ.


 కానీ ఊహించని రీతిలో పాకిస్తాన్ జట్టు అందరి ఆశలను అడి ఆశలుగా మార్చేసింది అన్న విషయం తెలిసిందే. లీగ్ మ్యాచ్లో వరస విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ లో ఎన్నో అంచనాల మధ్య అడుగుపెట్టిన టీమిండియా జట్టు సెమి ఫైనల్లో మాత్రం పటిష్టమైన ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దాదాపు పదవి వికెట్ల తేడాతో ఓడిపోయి చివరికి తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. తద్వారా ఇక టీమిండియా జట్టు సెమీఫైనల్ నుంచి నిష్క్రమించి వరల్డ్ కప్ నిరీక్షణను ఇక నిరీక్షణ గానే మిగిలేలా చేసింది. వరల్డ్ కప్ లో టీం ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత జట్టులో ప్రక్షాళన ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా సెలక్షన్ కమిటీ పై కొత్త బిసిసిఐ బాస్ రోజర్ బిన్నీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే టి20 ప్రపంచ కప్ లో భారత ప్రదర్శన పై బీసీసీఐ సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ సమక్షంలో ఇక నేడే ఈ సమీక్ష జరగబోతున్నట్లు సమాచారం. ద్రవిడ్ జట్టుకు దూరంగా ఉన్న టైంలో కోచింగ్ బాధ్యతలు చేపట్టిన వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉందట. ఈ సమావేశంలో 2023 వన్డే ప్రపంచ కప్ గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: