ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అనూహ్యమైన మార్పులు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా కనీసం ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేక క్లీన్ స్వీప్ అయింది అన్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇక ఈ ఓటమి తర్వాత అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అనూహ్యమైన  మార్పులు జరగ్గా.. ఏకంగా బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రమిజ్ రాజాను తొలగిస్తూ అక్కడి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.


 ఈ క్రమంలోనే ఎప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయే రమిజ్ రాజాను ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి పోయిన తర్వాత కూడా తన నోటి దురుసును ఆపడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపైనే రమిజ్ రాజాను సంచలన విమర్శలు చేశాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత తనను కనీసం బోర్డు ఆఫీసుకు కూడా రానివ్వడం లేదు అంటూ రమిజ్ రాజా ఆరోపించాడు.


 ఈ క్రమంలోనే రమిజ్ రాజా చేసిన విమర్శలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఒక పిల్లాడి దగ్గర బొమ్మలాకుంటే ఎలా ప్రవర్తిస్తాడో.. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి పోయిన రమిజ్ రాజా కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు అంటూ సల్మాన్ బట్ విమర్శించాడు. గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది వేటుకు గురయ్యారు. కానీ ఎవరు ఇలా ప్రవర్తించలేదు.  అసలు ఇన్నాళ్లపాటు క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగడమే అటు రమిజ్ రాజాను అదృష్టంగా భావించాలి అంటూ సల్మాన్ బట్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: