గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న జయదేవ్ ఉనాద్గత్ పేరు ఇక వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళ క్రితం అంటే 2010లో టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన జయదేవ్  ఆ తర్వాత టీమ్ ఇండియా తరఫున ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి. అయితే తర్వాత కాలంలో దేశవాళీ క్రికెట్లో అతను బాగా రాణించినప్పటికీ కూడా ఇక ఎందుకో టీం ఇండియా సెలెక్టర్లు మాత్రం జట్టు ఎంపికలో అతని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి.


ఇకపోతే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా జయదేవ్  అటు టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు  అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చిన ఛాన్స్ ని బాగా వినియోగించుకున్నాడు. ఏకంగా 12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చినప్పటికీ ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా కీలకమైన సమయంలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు జయదేవ్. ఇక ఇప్పుడు టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ద్వైపాక్షిక సిరీస్ లో ఆడుతున్న నేపథ్యంలో జయదేవ్ ఇక అటు రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్నాడు.


 గత కొంతకాలం నుంచి తన ప్రదర్శనతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన జయదేవ్ ఇక ఇటీవల మరోసారి చెలరేగిపోయాడు అని చెప్పాలి. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. ఢిల్లీ బ్యాట్స్మెన్లు దృవ్, వైభవ్, యష్ దుల్ తొలి ఓవర్ లోనే మూడు నాలుగు ఐదు బంతుల్లో డక్ అవుట్ చేశాడు. ఇక అప్పటికి జట్టు స్కోరు సున్నా కావడం గమనార్హం. కాగా ఇప్పటివరకు జయదేవ్  రంజీ ట్రోఫీలో 6 వికెట్లు తీశాడు. అతని దెబ్బతో ఢిల్లీ జట్టు పది పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: