గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా జట్టు భారీ అంచనాల మధ్య బలులోకి దిగింది అన్న విషయం తెలిసిందే.. కానీ ఎందుకో అంచనా అందుకోలేక తీవ్రస్థాయిలో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే లీగ్ మ్యాచ్ లలో బాగా రాణించినప్పటికీ సెమీఫైనల్ లో మాత్రం ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసి ఇంటి బాట పట్టింది టీం ఇండియా జట్టు. అయితే ఇక భారత వేదికగా జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని  భావిస్తుంది బీసీసీఐ.


 ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచి ఎంతో ప్రాణాలిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇక వరల్డ్ కప్ లో ఆడబోయే ఆటగాళ్లకు సంబంధించి 20 మంది ప్లేయర్లతో షార్ట్ లిస్ట్ రూపొందించింది అన్న విషయం  ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక సదరు ఆటగాళ్ల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇదే విషయంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఏకంగా వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ముందస్తు గానే కసరత్తు మొదలు పెట్టింది. ఇదే విషయంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ 20 మంది ప్లేయర్లతో షార్ట్ లిస్ట్ ని బిసిసిఐ రూపొందించినప్పటికీ వారి పేరు వెల్లడించలేదు. అయితే ఆటగాళ్లు ఎంపికలో జట్టు అనుసరించే విధానమే ప్రధాన పాత్ర పోషిస్తుందని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. మొదట దూకుడుగా ఆడుతున్న ఆటగాళ్లను గుర్తించాలి అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇక ఆటలో వచ్చిన మార్పులను త్వరగా గ్రహించే ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: