
దీంతో కేదార్ జాదవ్ని అతని అభిమానులు తప్ప మిగతా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మరిచిపోయారు అని చెప్పాలి. ఇక ఎవరూ కూడా అతని గురించి చర్చించుకోవడం లాంటివి చేయడం లేదు. అయితే ఇలా వార్తల్లో కనిపించకుండా పోయిన కేదార్ జాదవ్ ఇక ఇటీవలే తన ఇన్నింగ్స్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ప్రస్తుతం రంజి ట్రోఫీలో ఆడుతున్న కేదార్ జాదవ్ ఇటీవల తన అద్భుతమైన బ్యాటింగ్తో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్ర జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇక ఈ టోర్నీలో భాగంగా ఇటీవలే అస్సాంతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. ఏకంగా 283 బంతుల్లో 21 ఫోర్లు 12 సిక్సర్లు బాది 283 పరుగులు చేశాడు అని చెప్పాలి. కేదార్ జాదవ్ త్రిబుల్ సెంచరీ కూడా చేసేస్తాడు అని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత 283 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే కేదార్ జాదవ్ అద్భుతమైన ప్రదర్శనకు ప్రస్తుతం క్రికెట్ ఫాన్స్ అందరు కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. కాగా గతంలో ఐపీఎల్ లో జిడ్డు బ్యాటింగ్ తో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే.