
ముఖ్యం గా టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం తర్వాత ఈ ప్రచారం మరింత జోరు అందుకుంది అని చెప్పాలి. ఏకంగా రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్య ని కొత్త కెప్టెన్ గా నియమించ బోతున్నారు అంటూ ప్రచారం జరిగింది అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీలంక తో జరిగే టి20 సిరీస్ కి కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే హార్థిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శన గురించి ఇటీవల మాజీ ఆటగాడు గౌతమ్ కాంగ్రెస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాకు జట్టు లో ప్రత్యామ్నాయ ఆటగాడిని గుర్తిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు.
ఎందుకంటే ఏదైనా సమయం లో హార్దిక్ పాండ్య ఒకవేళ గాయం బారిన పడి జట్టుకు దూరమైతే ఇక అతని లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ని వెంటనే గుర్తించాలి లేదంటే టీమ్ ఇండియా ప్రమాదం లో పడుతుంది అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. పునరాగమనం భారత జట్టుకు ఎంతో గొప్ప ప్రయోజనం కానుంది అంటూ చెప్పుకొచ్చాడు. టోర్నమెంట్ కు భారత్ ఆతిథ్యం వహిస్తున్న కారణంగా హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ ఆటగాడు కావాలి. అందుకు 2011 ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ ప్రదర్శన ఉదాహరించాడు గౌతమ్ గంభీర్.