ఇప్పటివరకు పేలవమైన ఫాంతో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకొని ఇక ఎప్పటిలాగానే సెంచరీలతో చెలరేగిపోతూ ఉన్నాడు. ఫార్మట్ తో సంబంధం లేకుండా శతక్కొట్టుడు కొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా మరోసారి సెంచరీ చేసి తన కెరియర్లో 73వ శతకాని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే విరాట్ కోహ్లీ సెంచరీపై  అటు క్రికెట్ నిపుణులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక కోహ్లీ సెంచరీపై విమర్శలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు అని చెప్పాలి.


 ఇప్పుడే కాదు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడల్లా ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. కోహ్లీ ఫ్లాట్ వికెట్ పై సెంచరీ చేశాడని లేదా బలహీనమైన జట్టుపై సెంచరీ సాధించాడు అంటూ కొంతమంది పనిగట్టుకుని మరి విమర్శలు చేస్తూ ఉంటారు. శ్రీలంక పై కోహ్లీ సెంచరీ అనంతరం కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి.  కాగా ఇదే విషయంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్. ఆసియా కప్ లో  ఆఫ్ఘనిస్తాన్ పై కోహ్లీ సెంచరీ చేశాడు.  ఆఫ్ఘనిస్తాన్కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయినప్పటికీ పనికట్టుకొని బలహీనమైన జట్టుపై ఫ్లాట్ వికెట్పై కోహ్లీ సెంచరీ సాధించాడని విమర్శలకు పోతూ ఉంటారు.


 విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 73వ సెంచరీ నమోదు చేశాడు అన్న విషయం తెలియక వాళ్ళు అలా మాట్లాడతారో ఏమో నాకైతే అర్థం కాదు. కోహ్లీ ఒక క్రికెట్ జీనియస్ అంటూ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించారు. మరి ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అంటూ ప్రశంసించాడు సల్మాన్ బట్. ఇక కోహ్లీ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అంటూ అభివర్ణించాడు. అలాంటి ఇన్నింగ్స్ ఒక ఆటగాడిని మరో స్థాయిలో నిలబెడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ బట్.

మరింత సమాచారం తెలుసుకోండి: