దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మునుపటి ఫామ్ అందుకొని దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగానే ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూ తన పేరును లికించుకుంటున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు సెంచరీల మోత మోగిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. అద్భుతమైన నాక్స్ ఆడుతూ అతను ఎంత అత్యుత్తమమైన ఆటగాడో అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో చెప్పకనే చెబుతున్నాడు విరాట్ కోహ్లీ.

 ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో మరోసారి సెంచరీ చేసి చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన కెరియర్ లో 73వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పటివరకు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మట్ లో 45 సెంచరీలు చేయగా టెస్ట్ ఫార్మాట్లో 29 సెంచరీలు చేసాడు. ఇక టి20 ఫార్మాట్లో ఒకే ఒక సెంచరీ చేయడం గమనార్హం. అయితే ఇక సచిన్ వన్డే ఫార్మాట్లో 49 సెంచరీలు చేయగా ఇక ఇదే అత్యధికంగా కొనసాగుతూ ఉంది. ఇక ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీ నాలుగు సెంచరీల దూరంలో ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ రికార్డ్ మాత్రమే కాదు సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డులను కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం ఖాయం అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇటీవల భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఆల్ టైం గ్రేట్ ప్లేయర్. అదే విధంగా ఫార్మాట్ తో కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు.  అయితే టెస్ట్ క్రికెట్లో సచిన్ సాధించిన 51 సెంచరీల రికార్డును మాత్రం కోహ్లీ బ్రేక్ చేయడం అసాధ్యం. కానీ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగించి సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని భావిస్తున్నాను సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: