
ఆ తర్వాత కాలంలో మాత్రం నిలకడలేముతో ఫామ్ కోల్పోయి ఇక జట్టుకు దూరమైపోయాడు అని చెప్పాలి. అయితే దేశవాళి క్రికెట్లో రానించి మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాను అని నిరూపించుకున్నప్పటికీ అతన్ని సెలెక్టర్లు జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో గత ఏడాది కాలం నుంచి కూడా అతను టీమిండియాలో చోటు కోసం ఎంతో నిరీక్షణగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు అని చెప్పాలి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ టి20 లో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన పృథ్వి షా అప్పటినుంచి భారత జట్టులో చోటు కోల్పోయాడు.
అయితే ఎట్టకేలకు ఇక పృద్విషా నిరీక్షణకు తెరపడింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం సెలెక్టర్లు అతనికి జట్టులో అవకాశం కల్పించారు. ఈ ఒక్క మార్పు మినహా ఇక మిగతా ఎలాంటి మార్పులు లేకుండా అటు శ్రీలంకతో టి20 సిరీస్ ఆడిన జట్టునే మళ్లీ న్యూజిలాండ్తో టి20 సిరీస్ కి కూడా ఎంపిక చేశారు అని చెప్పాలి.. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని పక్కన పెట్టేశారు. మరోసారి ఇక టి20 కెప్టెన్సీ బాధ్యతలను అటు హార్దిక్ పాండ్యాకి అప్పగించారు. అయితే ఎట్టకేలకు పృథ్వి షాకు అటు జట్టులో అవకాశం దక్కడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.