
అయితే టీమిండియా తరఫున ఆడబోయే సిరీస్ లకు మాత్రమే కాదు ఇక ఈ ఏడాది ఎంతో ఘనంగా ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కి కూడా రిషబ్ పంత్ దూరం అవుతాడు అన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రిషబ్ పంత్. అయితే అతను దూరం అవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్గా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయాల బారిన పడి దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో ఇక ఢిల్లీ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టబోయే కొత్త కెప్టెన్ ఎవరు అన్న చర్చ మొదలైంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. అదే సమయంలో ఇక పంత్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన ఓజ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్ కు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో పిలిప్ సాల్ట్ కు తుది జట్టులో చోటు కల్పించాలని కోరాడు. అతని ఇటీవలే మినీ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ రెండు కోట్లకు కొనుగోలు చేసింది. సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో కూడా అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడు సాల్ట్.