భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ తో ప్రస్తుతం టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ నేడు ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఉప్పల్ స్టేడియంలో రెండో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే 2019లో చివరిసారిగా టీమ్ ఇండియా ఉప్పల్లో వన్డే మ్యాచ్ ఆడగా.. ఇక ఇప్పుడు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మొదటి వన్డే మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ వన్డే మ్యాచ్ ఎంతో ఆసక్తిని సంతరించుకోగా.. ఇక ఉప్పల్ స్టేడియంలో గతంలో టీమిండియా ఆడిన మ్యాచ్లకు సంబంధించిన గణాంకాలు.. ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో తెరమీదకి వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ వీరోచితంగా పోరాటం చేసిన తీరు గురించి ఇక ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. 2009లో ఆస్ట్రేలియా తో ఉప్పల్ స్టేడియం వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేరు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా.  50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత భారీ టార్గెట్ తో అటు లక్ష్య చేదనకు దిగింది టీం ఇండియా.  మొదట్లోనే తడబడింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ సురేష్ రైనా మినహా మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేసారు. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి ఇక పెవిలియన్ చేరారు.  సచిన్ టెండూల్కర్ సూపర్ సెంచరీ చేసి వీరోచిత పోరాటం చేశాడు 144 అందులోనే 175 పరుగులు చేశాడు. ఇందులో 19ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.. ఇక మరోవైపు సురేష్ రైనా కూడా అతనికి సహకారం అందించాడు. ఇక వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ సురేష్ రైనా అవుట్ అయిన తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎవరు కూడా సచిన్ టెండూల్కర్ కు సహకారం అందించలేదు. దీంతో సచిన్ భారీ షాట్లకు ప్రయత్నించి ఒంటరి పోరాటం చేశాడు. చివరి 3 ఓవర్లలో 19 పరుగులు కావలసిన సమయంలో సచిన్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో చివరికి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో మూడు పరుగులు తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో సచిన్ పోరాటం చేసిన గెలవకపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: