భారత క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనికే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ఇప్పటివరకు భారత క్రికెట్ లో ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఎన్నో ఆరోగ్య రికార్డులు సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని. ముఖ్యంగా కెప్టెన్ గా ఏకంగా రెండు వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు అందించి అటు భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను లికించుచుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు అత్యుత్తమ ఫినిషర్ గా వికెట్ కీపర్ గా కూడా ప్రపంచ క్రికెట్లో తన హవా నడిపించాడు.


 ఇక 2019లో మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రస్తుతం భారత క్రికెట్లో ఉన్న యువ క్రికెటర్లతో పోల్చి చూస్తే అతనికి ఎక్కువ క్రేజీ ఉంది అని చెప్పాలి.  అయితే 2019లో తన క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం దేశవాళి  క్రికెట్లో మాత్రమే భాగం అయ్యాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే మహేంద్రసింగ్ ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ ను కలిసేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎప్పుడు ఆసక్తి చెబుతూ ఉంటారు అని చెప్పాలి.


 కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రస్తుతం టీమిండియా తరఫున అవకాశాలు దక్కించుకున్న క్రికెటర్ల సైతం ధోనిని ఒక్కసారి కలిస్తే చాలు అని అనుకుంటారు. ఇకపోతే ఇటీవల ధోని తర్వాత జార్ఖండ్ డైనమైట్ గా పేరు సంపాదించుకున్న ఇషాన్ కిషన్ సైతం ధోని ని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు  18 ఏళ్ల వయసులో తొలిసారి ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక ధోని నేరుగా కలిసిన క్షణాలు తన జీవితంలో అత్యంత ముఖ్యమైనది అంటూ చెప్పుకొచ్చాడు. కష్టాలకు భయపడే మనస్తత్వంతో తనది కాదని ఎన్ని సవాళ్లను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: