దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ గత ఏడాది ఆసియా కప్ సందర్భంగా మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మూడేళ్ల పాటు సెంచరీ అనే పదానికి దూరమైన కోహ్లీ ఇక అదే సెంచరీ తో అభిమానుల నిరీక్షణకు తెరదించాడు అని చెప్పాలి. అయితే ఇక మళ్లీ ముడిపటి ఫామ్ లోకి వచ్చిన తర్వాత తనదైన రీతిలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. వరుసగా సెంచరీలు చేస్తూ ఇక ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ లో కూడా ఆడేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఇప్పటికే వన్డే టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసిన కోహ్లీ ఇక ఇప్పుడూ టెస్ట్ ఫార్మాట్లో కూడా సెంచరీ నిరీక్షణకు తెరదించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9వ తేదీన నాగ్ పూర్ వేదికగా అటు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్  విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించేందుకు కేవలం 64 పరుగుల దూరంలోనే ఉన్నాడు. అన్ని ఫార్మట్ లలో ఇప్పటివరకు 546 ఇన్నింగ్స్ లో 24 వేల 936 పరుగులు చేశాడు కోహ్లీ. ఇక ఆస్ట్రేలియా తో జరగబోయే మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 64 పరుగులు చేశాడంటే చాలు అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టిస్తాడు. కాగా లెజెండ్ సచిన్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకే 543 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి.. రికీ పాంటింగ్‌కు 565, జాక్‌ కలిస్‌కు 573, సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి అని చెప్పాలి. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి కంటే ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితా చూసుకుంటే.. సచిన్‌ టెండూల్కర్‌ 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్‌ (688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులు), జాక్‌ కలిస్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 25534) ఆతర్వాతి స్థానాల్లో అత్యధిక పరుగుల వీరులుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: